సారథి న్యూస్, హుస్నాబాద్: విప్లవ రచయితల సంఘం నేత ప్రముఖ న్యాయవాది వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా టౌన్ లోని అనభేరి, సింగిరెడ్డి భూపతిరెడ్డి అమరుల భవనంలో సోమవారం ఆయన విలేకరులతో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం సరికాదన్నారు.
ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జైలు జీవితం అనుభవిస్తున్న రాజకీయ ఖైదీల ఆరోగ్యపరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుందన్నారు. ప్రశ్నించే గొంతులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతుందన్నారు. కార్యక్రమంలో అక్కన్నపేట మండల కార్యదర్శి వనేశ్, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొమురయ్య, సుదర్శనాచారి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి హన్మిరెడ్డి, కార్యదర్శి సంజీవరెడ్డి పాల్గొన్నారు.