Breaking News

లుక్ తో కిక్ ఇచ్చేశాడు

లుక్ తో కిక్ ఇచ్చేశాడు

ట్రెండీ లుక్స్ తో అదరగొట్టడం స్టార్ హీరోలకు అలవాటే. డార్లింగ్ ప్రభాస్ అయితే ఆ విషయంలో ముందుంటాడు. ప్రతి సినిమాకీ ఓ కొత్త లుక్​తో ఫ్యాన్స్​కు ట్రీట్ ఇస్తుంటాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమాలకు తగ్గ లుక్ లో వేరియేషన్ చూపిస్తూనే వస్తున్నాడు. ఇదే క్రమంలో లేటెస్టుగా మరో కొత్త లుక్ లో దర్శనం ఇచ్చి సర్​ప్రైజ్​ చేశాడు ప్రభాస్. బ్లాక్ లెదర్ జాకెట్, రౌండ్ షేప్ గ్లాసెస్ గాగుల్స్ తో కొంటెనవ్వు నవ్వుతూ డార్లింగ్ ఇచ్చిన పోజ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ అల్ట్రా స్టైలిష్ లుక్ సూపర్ అంటూ ఫ్యాన్స్ ప్రభాస్ ఫొటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘రాధే శ్యామ్’ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి రాధా కృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తుండగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు ప్రభాస్ మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్​లో పెట్టాడు. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షనల్ మూవీ చేయనున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఇక ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ మూవీలో నటించనున్నాడు ప్రభాస్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ- సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తారు. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ లుక్ రివీల్ చేశారు. మిగతా రెండు సినిమాల లుక్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ అల్ట్రా స్టైలిష్ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.