సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా కొత్తకోట రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత లోపించిందని, కలెక్టర్ వెంటనే స్పందించి నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన పనులను పరిశీలించారు. పట్టణంలో రూ.నాలుగున్నర కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత కొరవడిందని ఆరోపించారు. ఇప్పటికైనా పర్యవేక్షణ పెంచాలని అధికారులను కోరారు. ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాలరాజుగౌడ్, అంజన్నయాదవ్, రాఘవేందర్, సురేష్, బాబు, మహేందర్, బాలాగౌడ్ ఉన్నారు.
- June 4, 2020
- లోకల్ న్యూస్
- BC SANGAM
- KOTHAKOTA
- కొత్తకోట రోడ్డు విస్తరణ
- రాచాల
- Comments Off on రోడ్డు పనుల్లో నాణ్యత ఏది?