Breaking News

రోకా సందడి

రానా ఆరోగ్యం బాగా లేదంటూ ఆ మధ్య సోషల్ మీడియా, న్యూస్ పేపర్లలో ఎన్నో వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ రీసెంట్​ రానా సినిమాల గురించి అప్​ డేట్స్​ వచ్చాయి. అయితే ఇప్పుడు రానా పెళ్లి వార్త అంతకంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోంది. ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఇదే న్యూస్ వినిపిస్తోంది. అభిమానులైతే పండుగ చేసుకుంటున్నారు. రానా మిహికాల నిశ్చితార్థం పెద్దల సమక్షంలో నిర్వహించిన రోకా ఫంక్షన్ సందడి బాగా జరిగింది. రానా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తున్న క్షణాలను బంధించిన ఫొటోలను వరుసకు సోదరి అయిన సమంతా అక్కినేని తాజాగా తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసింది. ఫొటోతో పాటు ‘2020కు గానూ ది బెస్ట్ న్యూస్ మాకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ.. రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ మీరు సంతోషంగా ఉండాలి’ అంటూ క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. ఈ ఫొటోలో రానా జంటతో పాటు నాగచైతన్య, సమంత, అభిరామ్, వెంకటేష్ తనయుడు అర్జున్, కుమార్తె కూడా ఉన్నారు. వెంకటేష్ కుమారుడు అర్జున్ రానా లాగే పొడవుగా ఉండి అందర్నీ ఆకర్షిస్తున్నాడు. తర్వలోనే హీరో అవుతాడేమోనని అప్పుడే అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయట.