Breaking News

రేణు ఎంతగొప్ప పనిచేసిందో..

రేణు ఎంతగొప్ప పనిచేసిందో..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ ఏదో టాపిక్ తో వార్తల్లో నిలుస్తోంది రేణుదేశాయ్. పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే సమాజానికి తనవంతు ఏదైనా చేయాలని లక్ష్యంతో ముందుకెళ్లే రేణూ తను చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని అభిమానులతో పంచుకుంటుంది. ఇప్పటికే కొన్ని మంచిపనులతో ఆకట్టుకున్న రేణు రీసెంట్ గా మరో పనితో అందరి ప్రశంసలు అందుకుంటోంది. కేన్సర్ పేషెంట్స్కోసం తాను తన హెయిర్ ను కట్ చేసి దానం చేసిందట. ఆ విషయాన్ని చెబుతూ.. ‘కేన్సర్ పేషెంట్స్ కోసం జుట్టును దానం చేయండి..’ అంటూ తన కొత్త హెయిర్ స్టైల్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసింది.

కేన్సర్ పేషెంట్స్ కు ట్రీట్​మెంట్​ ఇచ్చే విధానం జుట్టు చాలా వరకూ ఊడిపోతుంది. అందుకే వారికోసం స్వచ్ఛంద సంస్థలు జుట్టు సేకరించి విగ్గులు తయారుచేసి వారికి ఇస్తూ ఉంటాయి. పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే తమ జుట్టు దానం చేసి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు. వారి జాబితాలో ఇప్పుడు రేణు కూడా చేరింది. దీంతో ఆమెపై ‘జట్టు కట్ చేసుకుని మంచి తనంతో మరింత అందంగా కనిపిస్తున్నారు. తన మంచి మనసుకి ఇదొక నిదర్శనమంటూ..’ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. రేణు నటనకు గుడ్‌బై చెప్పి చాలా కాలం అయినా ఆమె సినిమాలను డైరెక్ట్ చేస్తూ, ప్రొడక్షన్‌ చేస్తూ, అలాగే సోషల్ ఏవేర్ నెస్ ప్రోగ్రామ్స్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఈ పని అందరికి ఆదర్శంగా నిలుస్తోంది.