Breaking News

రిచర్డ్స్​కు జనాకర్షణ ఎక్కువ

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్​లో వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వీవీఎన్ రిచర్డ్స్​కు జనాకర్షణ ఎక్కువని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ స్మిత్ అన్నాడు. అతను ఆడుతుంటే… స్టేడియాలు హోరెత్తిపోతాయన్నాడు. అలాంటి విధ్వంసకర బ్యాట్స్​మెన్​ను ఐపీఎల్​లో ఆడించాలంటే కమిన్స్, స్టోక్స్ కంటే ఎక్కువే చెల్లించాల్సి వచ్చేదని స్మిత్ వ్యాఖ్యానించాడు. రిచర్డ్స్ ఆడే సమయంలో ఐపీఎల్ లేదు కాబట్టి ఫ్రాంచైజీలు బతికిపోయాయన్నాడు. ‘ఏ దశాబ్దంలోనైనా, ఏ ఫార్మాట్లోనైనా రిచర్డ్స్​కు తిరుగులేదు. అప్పట్లోనే అతని స్ట్రయిక్ రేట్ 67, 68గా ఉంది. అలాంటి సమయంలో టీ20లు ఉండి ఉంటే స్ట్రయిక్ ఎక్కడికికో వెళ్లేది. కచ్చితంగా టీ20లకు దిగ్గజంగా మారేవాడు. అప్పుడు కమిన్స్‌, స్టోక్స్‌ కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వచ్చేది. నాకు తెలిసినంత వరకు లీగ్‌ మొత్తానికే అత్యంత విలువైన ప్లేయర్ అయ్యేవాడు’ అని ఇయాన్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ క్రికెట్ లో చాలామంది చాలా రికార్డులు సృష్టించినా బౌలర్లపై రిచర్డ్స్ లా ఎదురుదాడి మాత్రం ఎవరూ చేయలేదన్నాడు.