సారథి న్యూస్, నర్సాపూర్: రక్తదానం ప్రాణదానంతో సమానమని మెదక్ డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన 13 మంది యువకులు కౌడిపల్లి పీహెచ్లో గురువారం రక్తదానం చేశారు. యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. చాలా మంది గర్భిణులు రక్తం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ వో విజయనిర్మల, పీహెచ్సీ డాక్టర్ వెంకటస్వామి, శోభన, సర్పంచ్లు వెంకటేశ్వర్ రెడ్డి, శోభ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
- April 23, 2020
- లోకల్ న్యూస్
- MEDAK DMHO
- కౌడిపల్లి
- నర్సాపూర్
- మెదక్ డీఎంహెచ్వో
- రక్తదానం
- Comments Off on రక్తదానం గొప్ప కార్యం