- మంత్రి హరీశ్‌రావు
సారథి న్యూస్, మెదక్: తలసేమియా బాధితులు, గర్భిణుల కోసం టీఎన్జీవోల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు మేడిశెట్టి శ్యామ్ రావు, కార్యదర్శి దొంత నరేందర్ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ టీఎన్జీవో భవన్ లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఏరియా హాస్పిటల్ పర్యవేక్షకుడు చంద్రశేఖర్, టీఎన్జీవోస్ జిల్లా సహా అధ్యక్షుడు జెల్లా సుధాకర్, మెదక్ నియోజకవర్గ అధ్యక్షుడు బట్టి రమేష్ పశుసంవర్ధక శాఖ జిల్లా అధ్యక్షుడు శివాజీ, జిల్లా ఉపాధ్యక్షురాలు గాండ్ల అనురాధ పాల్గొన్నారు.