వాషింగ్టన్: ఇప్పుడున్న పరిస్థితుల్లో యూఎస్ ఓపెన్‌లో ఆడడం సందేహమేనని స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ అన్నాడు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనన్నాడు. ‘యూఎస్ ఓపెన్‌లో ఆడతావా? అని ఈ రోజు నన్ను అడిగితే నో అనే చెబుతా. రాబోయే రెండు నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. మెరుగైతే బరిలోకి దిగుతా. లేకపోతే కష్టమే. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఎందుకంటే న్యూయార్క్‌లో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అక్కడికి ప్రయాణం చేయడం సురక్షితమో కాదో తెలుసుకోవాలి. అక్కడికి వచ్చే ప్రతి ప్లేయర్ కూడా సురక్షితమైన దేశం నుంచి వస్తున్నారో లేదో తెలియదు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం ఉంటుంది’ అని నాదల్ పేర్కొన్నాడు. షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 31 నుంచి న్యూయార్క్‌లో యూఎస్ ఓపెన్ జరగాల్సి ఉంది. ఇప్పటికైతే టోర్నీ రద్దుపై నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవసరమైతే చార్టెడ్ ప్లయిట్స్లో ప్లేయర్లను తీసుకొచ్చే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు.
- June 5, 2020
- క్రీడలు
- RAFEL NADHAL
- US OPEN
- న్యూయార్క్‌లో యూఎస్
- రఫెల్ నాదల్
- Comments Off on యూఎస్ ఓపెన్‌కు నాదల్ డౌటే