Breaking News

యువరాజ్​ సింగ్​పై కేసు

న్యూఢిల్లీ: ఓ కులానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. టీమిండియా మాజీ ఆల్​ రౌండర్ యువరాజ్ సింగ్​పై పోలీసు కేసు నమోదైంది. వివరాళ్లోకి వెళ్తే.. మొన్న రోహిత్​తో జరిగిన ఇన్​స్టాగ్రామ్​ లైవ్​లో యువరాజ్.. చహల్​ ప్రస్తావన తెచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి చేసిన వీడియోలను చహల్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాడని రోహిత్​ను అడిగాడు. వీళ్లకు ఏం పని లేదా? అంటే కాస్త కఠినస్వరంతో హెచ్చరించాడు. ఆ క్రమంలో ‘భంగి’ (బోయ కులం) అనే పదాన్ని ఉపయోగించడంతో వివాదం రాజుకుంది. రోహిత్ కూడా సరదాగా నవ్వేయడంతో దళిత హక్కుల నేతలు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. హర్యానాకు చెందిన దళిత హక్కుల నేత, అడ్వకేట్‌ రజత్‌ కల్సాన్‌.. హిస్సార్‌లోని హన్సీలో ఫిర్యాదు చేశాడు. యువీ ఆ మాట అన్నప్పుడు హిట్‌మ్యాన్‌ వ్యతిరేకించాల్సిందని కల్సాన్ విమర్శించాడు. అయితే ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలని యువీని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ‘మాఫీ మాంగో’ అనే హ్యాష్ ట్యాగ్​తో నెట్​ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.