Breaking News

మైసూర్​పాక్​తో కరోనా నయం​

చెన్నై: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మోసగాళ్ల రెచ్చిపోతున్నారు. కరోనాకు మందు కనిపెట్టామంటూ ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ ప్రకటించి.. ఆ తరువాత తూచ్ అంటూ నాలుక కరుచుకున్నది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ స్వీట్​ షాప్​ ఇదే తరహా మోసానికి పాల్పడింది. తమ దుకాణంలో తయారుచేసే మైసూర్​ పిక్​ తిని కరోనాను నయం చేసుకోవచ్చని ప్రచారం మొదలుపెట్టింది. అంతేకాక రూ.800 కిలో చొప్పున ఆ స్వీట్​ను అమాయకులకు అంటగట్టింది. ఈ మైసూర్​పాక్​లో 19 రకాల హెర్చల్​ పదార్థాలను వాడుతున్నామంటూ మోసానికి పాల్పడింది. ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ( ఫుడ్​ సెఫ్టీ అండ్​ స్టాండర్డ్స అథారిటీ ఆఫ్​ ఇండియా) ఆ దుకాణంలో తనిఖీలు చేసి దుకాణం లైసెన్స్​ను రద్దు చేసింది. కరోనాను నయం చేస్తామంటూ కొందరు చేస్తున్న తప్పడు ప్రచారాలను నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు.