Breaking News

మేమిద్దరం భిన్నమైన ఆటగాళ్లం

మేమిద్దరం భిన్నమైన ఆటగాళ్లం
  • పాక్‌ టాప్‌ బ్యాట్స్​ మన్ బాబర్‌ ఆజమ్‌

కరాచీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, తాను భిన్నమైన క్రికెటర్లమని పాక్‌ టాప్‌ బ్యాట్స్​ మన్ బాబర్‌ ఆజమ్‌ అన్నాడు. తమను పరస్పరం పోల్చడం తెలివైన పనికాదన్నాడు. ‘నన్ను వేరే వాళ్లతో పోల్చకపోవడమే బెటర్‌. నేను భిన్నమైన క్రికెటర్‌ను. పరుగులు చేసి టీమ్‌కు సాయం పడడం నా బాధ్యత. మైదానంలోకి వెళ్లిన ప్రతిసారి నేను ఇదే పనిచేస్తా. నన్ను నేను నిరూపించుకుంటున్నా. కోహ్లీ ఇప్పటికే చాలా సాధించాడు. చాలా నిరూపించుకున్నాడు కూడా. అలాంటి వ్యక్తితో నాకు పోలిక ఏంటీ. క్రికెట్‌లో సమకాలికులమైనా.. మా ఆలోచన, మా ఆటతీరు పూర్తి భిన్నం’ అని బాబర్‌ పేర్కొన్నాడు.

10 ఏళ్లుగా తాము ఖాళీ స్టేడియాల్లోనే ఆడుతున్నామని, ఈ విషయం మిగతా వాళ్లకంటే తమకే బాగా తెలుసన్నాడు. యూఏఈలో జరిగే హోమ్ సిరీస్​ లన్నీ ఖాళీస్టేడియాల్లోనే ఉంటాయని గుర్తుచేశాడు. టీ20 ప్రపంచకప్​పై ఐసీసీ అన్ని విధాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందన్నాడు. ఇక జులైలో తాము ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్తున్నామని, ఇందులో ఎలాంటి సందేహాలు వద్దన్నాడు.