Breaking News

మేమిద్దరం పంజాబీలం


కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. టీమిండియా ప్లేయర్లపై కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. కోహ్లీ, తాను పంజాబీలమని, తమ ఇద్దరి స్వభావం ఒకే తీరుగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ‘నేను, కోహ్లీ మంచి స్నేహితులం. అయితే మైదానంలో మాత్రం బద్ద శత్రువులం. ఇందులో తేడా లేదు. మా స్వభావం ఒకేలా ఉంటుంది. ఇద్దరం పంజాబీలం కాబట్టి. విరాట్ కు దూకుడు ఎక్కువ. ఆటలో ఇలానే ఉండాలి. నా కన్నా జూనియర్ అయినా చాలా గౌరవిస్తాను.

కోహ్లీ మోడ్రన్ బ్రాడ్ మన్. అతడిని ఔట్ చేయడం చాలా కష్టం. అందుకే 150 కి.మీ. వేగంతో క్రీజుకు దూరంగా బంతులు వేసేవాడిని’ అని అక్తర్ పేర్కొన్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఇద్దరు ఒకే ఒక్క మ్యాచ్ లో బరిలోకి దిగారు. కానీ అక్తర్ బౌలింగ్ ను కోహ్లీ ఎదుర్కోలేదు. ఆసియా కప్–2010లో భాగంగా భారత్, పాక్ మ్యాచ్ జరిగింది. కోహ్లీ 17 పరుగులు చేసి స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. కోహ్లీ బ్యాటింగ్ చేసేటప్పుడు అక్తర్ బౌలింగ్ దిగనే లేదు.