న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కానీ గ్రౌండ్ వెలుపలా తన వాళ్ల కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడంటా.
ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా కచ్చితంగా వెళ్లి తీరుతాడట. తన పెళ్లి సందర్భంగా ధోనీ చేసిన రిస్క్ గురించి టీమిండియా సహచరుడు మన్ దీప్ సింగ్ వెల్లడించాడు.గడ్డకట్టే చలిలో విపరీతమైన పొగమంచులో మూడు ఫ్లయిట్స్ మారి..
రెండు గంటలు డ్రైవింగ్ చేసి తన మ్యారేజ్‌కు మహీ అటెండ్ అయిన విషయాన్ని పంచుకున్నాడు. ‘2016లో నా వెడ్డింగ్ జరిగింది. పెళ్లికి రావాలని మహీ బాయ్‌ని ఆహ్వానించా. అయితే వస్తానా? రానా? అనే విషయాన్ని నాతో చెప్పలేదు.
న్యూయార్క్ వెళ్లాల్సిన పని ఉందని మాత్రం చెప్పాడు. కానీ సడెన్‌గా వచ్చి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రాంచీ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి అమృత్‌సర్‌కు మూడు సెపరేట్ ఫ్లయిట్స్ లో జర్నీచేశాడు. గడ్డకట్టే చలిలో, పొగమంచులో రెండు గంటలు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. మరొకరు అయితే ఇంత రిస్క్ అవసరమా? అని భావించేవారు.
కానీ మహీ అలా కాదు. నమ్మితే ప్రాణమిస్తాడు. అదే అతనిలో ఉండే సింప్లిసిటీ, గొప్పతనం. ఆ ఫీలింగ్‌ను నేను మాటల్లో వర్ణించలేను. ఏదేమైనా నా కల నిజమైనందుకు చాలా సంతోషించా. కేవలం కొన్ని మ్యాచ్ లే అతని ఆధ్వర్యంలో ఆడా. ప్లే స్టేషన్‌లో ఇద్దరం కలిసి ఆడేవాళ్లం. లంచ్, డిన్నర్ కోసం బయటకు వెళ్లేవాళ్లం.
లోకల్ ఫుడ్‌ను బాగా ఎంజాయ్ చేస్తాడు. లెజెండరీ క్రికెటర్ అనే ఫీలింగ్ ఎప్పుడూ చూపడు. చాలా డౌన్ టు ఎర్త్. అందుకే మహీ అంటే అందరికి చాలా ఇష్టం’ అని మన్‌దీప్ గుర్తు చేసుకున్నాడు.