Breaking News

మాస్టర్.. బార్బర్

న్యూఢిల్లీ: దేశానికి రాజు అయినా..తల్లికి కొడుకే అనే సామేత అందరికీ తెలిసిందే. అయితే ఎంత ఎత్తుకుఎదిగినా కుటుంబం వరకు వచ్చేసరికి తనకున్న బాధ్యతలను నిర్వహించాల్సిందే. అందుకే ప్రపంచ క్రికెట్​ను ఏలిన సచిన్ టెండూల్కర్ కూడా తన పిల్లల విషయంలో ఓ తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
లాక్​ డౌన్​తో బార్బర్ షాప్స్ మూతపడడంతో తానే స్వయంగా కత్తెర పట్టాడు. కుమారుడు అర్జున్ కోసం హెయిర్ స్టయిలిస్ట్​ గా మారిపోయాడు. కటింగ్ చేస్తూ తనకు నచ్చిన రీతిలో కొడుకు హెయిర్ స్టైల్​ ను సెట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్​ స్టాగ్రామ్​ లో పోస్ట్ చేయడంతో వైరల్​ గా మారింది. ‘తండ్రిగా మన బాధ్యతలను నిర్వహించాల్సిందే. పిల్లలతో గేమ్స్ ఆడాలి. జిమ్​కు వెళ్లాలి. ఒక్కోసారి హెయిర్ కూడా కట్ చేయాలి. ఈ హెయిర్ స్టైల్​తో నీవు అందంగా మారుతావు. నా సెలూన్ అసిస్టెంట్​ గా చేసిన సారా టెండూల్కర్​ కు కృతజ్ఞతలు’ అని సచిన్ రాసుకొచ్చాడు.