సారథి న్యూస్, నాగర్ కర్నూల్: కొల్లాపూర్ నియోజకవర్గంలోని మాచినేనిపల్లి శివారులోని ఎండోమెంట్ భూమిని అడిషినల్ కలెక్టర్ హన్మంత్ రెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు.
నియోజకవర్గంలో విరివిగా విస్తరించి ఉన్న మామిడి పంటలకు స్థానికంగానే మార్కెట్ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు నూతనంగా మార్కెట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొల్లాపూర్ మామిడికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. నూతన మార్కెట్ తో ఇక్కడి రైతుల కష్టాలు తీరనున్నాయని, రైతుల కలలను సాకారం చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు.