Breaking News

మహాత్ముడి బాటలో నడుద్దాం

మహాత్ముడి బాటలో నడుద్దాం

సారథి న్యూస్​, కర్నూలు: నిబద్ధత, పట్టుదల, కృషి, సమయస్ఫూర్తి.. వంటివి మహాత్మగాంధీని దేశానికి జాతిపితగా చేశాయని, ప్రతిఒక్కరూ ఆయన బాటలో నడవాలని వైఎస్సార్​సీపీ కర్నూలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్​సీపీ జిల్లా కార్యాయంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ముఖ్యఅతిథులుగా నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. గాంధీ ఆశయ సిద్ధి కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాన్నారు. నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. అహింసతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించిన యోధుడు గాంధీజీ అని, అందుకే ఆయన ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్​సీపీ నగర అధ్యక్షు రాజా విష్ణువర్ధన్‌ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నగర కార్యాలయంలో..
దేశానికే ఆదర్శమూర్తి మహాత్మ గాంధీ అని, ఆయన జీవిత చరిత్రలో ప్రతి అంకం ఎందరికో స్ఫూర్తిదాయకమని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని వైఎస్సార్​సీపీ కార్యాలయంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ పూలమాలలు వేశారు.
మైనార్టీ భవన్‌లో..
కర్నూలు నగర మైనార్టీ భవన్‌లో జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. జిల్లా మైనార్టీ సంఘం నాయకులు సయ్యద్‌ అబ్దుల్‌ హమీద్‌ షంషుద్దీన్‌ రియాజ్‌ షఫీవుల్లా, ఎస్‌ఎన్‌ భాష సలీం భాష అబ్దుల్లా మాట్లాడుతూ.. గాంధీ బాటలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కర్నూలు కలెక్టరేట్‌ వద్దనున్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా సేవా స్తంబ్​ జిల్లా అధ్యక్షు సయ్యద్‌ రోషన్‌ అలీ, ఉపాధ్యక్షుడు సీబీ అజయ్‌ కుమార్‌, ప్రచార కార్యదర్శి షఫీఉల్లా, రవి, రహీమ్‌, సుభాన్‌ ఖాసీం, ఖాజా నరసయ్య, తిరుపాల సోమన్న పాల్గొన్నారు.