న్యూఢిల్లీ: శ్రీలంక పేసర్ లసిత్ మలింగ.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ యార్కర్ బౌలర్ అని టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘకాలంగా తన మిస్టరీ డెలివరీలతో ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడన్నాడు. ‘మలింగ అలుపన్నదే లేకుండా బౌలింగ్ చేస్తాడు. అది కూడా బెస్ట్ యార్కర్లతో. అతని డెలివరీ కూడా పెద్దగా అర్థం కాదు. అర్థమైనట్లే ఉంటుంది కానీ ఆడడం చాలాకష్టం. ఇదే అతని బలం. అంతర్జాతీయ క్రికెట్లో ఆ బలాన్ని ఇంకా కొనసాగించడం మరో అద్భుతం’ అని బుమ్రా పేర్కొన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత బౌలింగ్ చేస్తే శరీరం ఎలా స్పందిస్తుందో చూడాలన్నాడు. ‘కరోనా బ్రేక్‌తో బౌలింగ్‌కు దూరమై చాలా రోజులైంది. వారంలో ఆరు రోజులు మాత్రం ఎక్సర్సైజ్లు చేస్తున్నా. కానీ బౌలింగ్ జోలికి పోలేదు. తొలి బంతి వేసినప్పుడు శరీరం ఎలా స్పందిస్తుందో చూడాలి. దానిని అధిగమించేందుకు కూడా చాలా కృషి చేయాల్సి ఉంటుంది’ అని ఈ ముంబై ఇండియన్స్ బౌలర్ వెల్లడించాడు.
- June 5, 2020
- క్రీడలు
- BUMRHA
- MALINGA
- బుమ్రా
- ముంబై ఇండియన్స్
- యార్కర్ బౌలర్
- Comments Off on మలింగ.. వరల్డ్ బెస్ట్ యార్కర్ బౌలర్