Breaking News

ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీపై కరోనా దెబ్బ

ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీపై కరోనా దెబ్బ

పారిస్‌: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీని రద్దుచేశారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జూన్ 28న జరగాల్సిన ఈ రేస్ ను కొనసాగించడం కష్టమని నిర్వాహకులు స్పష్టం చేశారు.

2020 ఫార్ములా వన్‌ సీజన్‌లో కరోనా దెబ్బకు వాయిదా లేదా రద్దయిన పదో ఈవెంట్‌ ఇది. ఆస్ట్రేలియా (మార్చి 15), మొనాకో (మే 24) రేస్‌లు కూడా రద్దు కాగా, బహ్రెయిన్ (మార్చి 22), వియత్నాం (ఏప్రిల్ 5), చైనా (ఏప్రిల్ 19), నెదర్లాండ్స్ (మే 3), స్పెయిన్‌ (మే 10), అజర్‌‌ బైజాన్ (జూన్ 7), కెనడా (జూన్ 14) ఈవెంట్లు వాయిదాపడ్డాయి. జులై 5న షెడ్యూల్ చేసిన ఆస్ట్రియా గ్రాండ్‌ ప్రీతో ఈ సీజన్‌ ప్రారంభమవుతుందని ఫార్ములా వన్ బాస్‌ చేజ్‌ క్యారే ఆశాభావం వ్యక్తంచేశారు.