Breaking News

పోలీస్ ఆఫీసర్ గా చేయాలనుంది

అభిమానులతో ఎప్పుడూ టచ్​లో ఉండే యంగ్ హీరో సందీప్ కిషన్ ఇన్ స్టాగ్రామ్ లో ఈసారి అతని సినిమా విషయాలతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా చెప్పాడు. ప్రస్తుతం తను చేస్తున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ రీమేక్ మూవీ అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నాడు. టీజర్ చూస్తే ఎవరూ అలా అనుకోరు.. కానీ టీజర్ రిలీజ్ చేయాలంటే కొన్నిరోజులు పడుతుందని.. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టు చెప్పాడు. రీసెంట్ గా ఈ మూవీకోసం సందీప్ 12కిలోల బరువు కూడా తగ్గాడు. అంతేకాదు తనకు ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలనుందని.. గతంలో పోలీస్ పాత్రలో నటించినా పూర్తిస్థాయి కాప్ డ్రామా చేయలేదు కాబట్టి ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ‘టైగర్’ చిత్రంలోని క్యారెక్టర్ బెస్ట్ అనుకుంటున్నాడట. తర్వాత వీఐ ఆనంద్ దర్శకత్వంలో మరో చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడట.