సారథి న్యూస్, గోదావరిఖని: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పోలీసులు ఎంతో శ్రమించారని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సన్ రైస్, స్టార్ హాస్పిటల్స్ డైరెక్టర్లు డాక్టర్ సురేష్, డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ సిబ్బందికి మంగళవారం వారు మాస్క్‌లు, శానిటైజర్స్ అందజేశారు. కార్యక్రమంలో సీపీ వి.సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్, ఏసీపీ నరేందర్,మంచిర్యాల పట్టణ సీఐ ముత్తి లింగయ్య, సైబర్ క్రైమ్ ఇన్ స్పెక్టర్ బుద్దె స్వామి, మంచిర్యాల పట్టణ ఎస్సై ప్రవీణ్ పాల్గొన్నారు.
- May 19, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- RAMAGUNDAM CP
- మంచిర్యాల డీసీపీ
- Comments Off on పోలీసుల సేవలు మరవలేనివి