- ఐటీసీ నుంచి పోలీసు సిబ్బందికి డ్రింక్స్ పంపిణీ
సారథి న్యూస్, గోదావరిఖని: పోలీస్ సేవలను ప్రశంసిస్తూ ఐటీసీ జ్యూస్ ఉత్పత్తులను సంస్థ తరఫున మేడి ప్రవీణ్ బుధవారం రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణకు అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ విజయవంతం చేసేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్, ఏసీపీ ఏఆర్ సుందర్ రావు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, ఆర్ఐ మధుకర్ గునిశెట్టి రవితేజ, తోకల మణిరాజ్, మహేష్ కుమార్ పాల్గొన్నారు.