నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
సారథి న్యూస్, నారాయణఖేడ్: సీఎం కేసీఆర్ బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి కొనియాడారు. పేదల కష్టాలు ఆయనకు తెలుసునన్నారు. అందుకోసమే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. గురువారం ఆయన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు అందజేశారు. ఖేడ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు.