సారథి న్యూస్, నర్సాపూర్: కౌడిపల్లి మండలం వెంకటాపూర్(ఆర్) గ్రామంలో సీవీఆర్ యువసేన నాయకుడు విక్రమ్ రెడ్డి 30 నిరుపేద కుటుంబాలకు సోమవారం సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా, ఉపసర్పంచ్ మహేష్ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ వేళ.. పేదలు ఇబ్బంది పడకూడదని సరుకులు పంపిణీ చేశారు. అలాగే వెంకటాపూర్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారులు హరీశ్‌రెడ్డి, సతీశ్ రెడ్డి నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- April 27, 2020
- లోకల్ న్యూస్
- CVR
- YUVASENA
- కరోనా
- సరుకులు పంపిణీ
- Comments Off on పేదలకు సాయం