- నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా సమయంలో పేదలను ఆదుకోవడం అభినందనీయమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ సీఎస్ఐ చర్చి కమిటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి హాజరయ్యారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.