Breaking News

పెళ్లికి రెడీ

పెళ్లికి రెడీ

టాలీవుడ్​ లో యంగ్ హీరోలంతా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఆల్రెడీ నిఖిల్ ఒక ఇంటివాడవగా లిస్ట్లో రానా, నితిన్లు ఉన్నారు. చాలా రోజులుగా శాలినిని ప్రేమిస్తున్న నితిన్ మొన్న ఏప్రిల్ నెలలో పెళ్లికి సిద్ధమయ్యాడు. దుబాయ్లో భారీ డెస్టినేషన్ మ్యారేజీకి నాలుగు నెలల ముందే ప్లాన్ చేశారు కూడా. అయితే కరోనా కారణంగా సీన్ రివర్స్ అయ్యింది. మధ్యలో మళ్లీ మ్యారేజ్ని దుబాయ్లోనే జరిపిస్తామంటూ రెండు ఫ్యామిలీలు ప్రకటించాయి. అయితే పరిస్థితులు ఇప్పుడప్పుడే కుదుట పడేటట్లు లేని కారణంగా, కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉన్నందున పెళ్లి వాయిదా వేయడం కరెక్ట్ కాదన్న నిర్ణయానికి కుటుంబ సభ్యులు వచ్చేసిట్టున్నారు. అయితే ప్రస్తుతం ఆషాఢమాసం నడుస్తోంది.

హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాఢంలో పెళ్లిలు జరిపించరు. శ్రావణ లేదా కార్తీక మాసంలో పెళ్లిలు ఎక్కువగా జరుపుతారు కాబట్టి.. నితిన్ పెళ్లిని ఆషాఢం పూర్తి అయిన వెంటనే జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. హైదరాబాద్ శివారులో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో పెళ్లికి సిద్ధమవుతున్నారు. అతి కొద్ది మంది బంధు మిత్రులను ఈ పెళ్లికి నితిన్ అండ్ ఫ్యామిలీ ఆహ్వానించబోతున్నారు. జులై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో నితిన్, షాలినిల వివాహం జరగొచ్చు అన్న వార్త వినపడుతోంది.