Breaking News

పారితోషికం పెంచిన దీపికా

పారితోషికం పెంచిన దీపికా పదుకునే

నటనతో కొంతమందికి మాత్రమే పరిచయం.. గ్లామర్​తో మాత్రం ఎంతో మందికి సుపరిచయం. ఆమె క్రేజ్ కూడా అలాగే ఏ ఏటికాయేడు పెరుగుతూనే వస్తోంది.. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? లేటెస్ట్ గా ప్యాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్​తో కలిసి టాలీవుడ్ కు విచ్చేయనున్న దీపికా పదుకునే. బాలీవుడ్ హీరోయిన్ దీపికా సౌత్ స్టార్ హీరోల్లో కొందరు మాత్రమే ఆమె తీసుకునే పారితోషికాన్ని తీసుకునే స్టేజీలో ఉన్నారు. ఒక్కో సినిమాకి ఆమె సుమారు రూ.15 కోట్లు తీసుకుంటుందని సమాచారం. దాన్ని చూసి కొందరు ఈర్ష్య కూడా పడతారనుకోండి. అయితే ఈ విషయాన్ని సీఈవో వర్డల్డ్ అధికారికంగా తెలియజేసింది. ఇటీవల దీపిక తన పారితోషికాన్ని పదిశాతం పెంచినట్లు కూడా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికి సినిమాలు, బ్రాండ్స్ ప్రమోషన్ ద్వారా 65 మిలియన్ డాలర్ల సంపాదించిందట. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.480 కోట్లు అని.. ఇప్పటి వరకు ఏ ఇండియన్ హీరోయిన్ కూడా ఈ స్థాయిలో సంపాదన దక్కించుకోలేదని అంటున్నారు. ఆమె గత ఆరు ఏడు ఏళ్లుగా బాలీవుడ్ లోనే టాప్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వస్తోంది. దానికి తోడు సక్సెస్ పొందిన ప్రతి సినిమా తర్వాత తన పారితోషికాన్ని అనూహ్యంగా పెంచుతూ వచ్చిందట. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేయడంతో దీపికకు భారీస్థాయిలో పారితోషికాలు వస్తున్నాయంటున్నారు. ఆమె తర్వాత స్థానంలో యూనివర్శిల్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ప్రియాంక చోప్రా ఉంది. ఆమె దాదాపుగా రూ.50 మిలియన్ డాలర్లను సంపాదించినట్లు తెలుస్తోందట. మూడవ స్థానంలో అనుష్క శర్మ ఉంది. ఇలా టాప్ లో ఉన్న వీళ్ల ముగ్గురూ పెళ్లి అయిన వారే అవడం మరో విశేషం.