Breaking News

పర్స.. అడుగుజాడల్లో నడవాలి

సారథి న్యూస్​, గోదావరిఖని: పర్స సత్యనారాయణ.. విప్లవ ఉద్యమానికి నాంది పలికారని, కార్మికవర్గం ఆయన అడుగు జాడల్లో నడవాలని పెద్దపల్లి జిల్లా సీఐటీయూ ఎర్రవెల్లి ముత్యం రావు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పర్స సత్యనారాయణ ఐదో వర్ధంతి స్థానిక సీఐటీయూ ఆఫీసులో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మిక ప్రాంతంలో పరస సత్యనారాయణ చేసిన కార్మిక ఉద్యమాల వలన ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవని విప్లవ ఉద్యమానికి నాంది పలికారని కొనియాడారు.