సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించి ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాల్వ మంజూరై 27 ఏళ్లు గడుస్తున్నా నేటికీ పనులు పూర్తి కాలేదన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును 1.7 నుంచి 8.23 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రెండవ సారి భూమి కోల్పోయిన భూనిర్వాసితులకు పరిహారం, పునరావాస ప్యాకేజీ పూర్తిస్థాయిలో అందలేదన్నారు. గండిపల్లి రిజర్వాయర్ పనులు నత్తనడకన సాగుతున్నాయని వివరించారు. భూ నిర్వాసితులు, ఏజెన్సీలకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు.