సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత సూచించారు. పట్టణంలోని 1,13వ వార్డుల్లో సోమవారం శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీకి కారణమయ్యే దోమలు పెరగకుండా చూసుకోవాలన్నారు. ఆమె వెంట వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్లు కొంకటి నళినిదేవి, కల్పన, సుప్రజా, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య ఉన్నారు.
- June 1, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- HUSNABAD
- MUNCIPAL
- మున్సిపల్ చైర్పర్సన్
- శానిటేషన్
- హుస్నాబాద్
- Comments Off on పరిశుభ్రత పాటించడమే ముఖ్యం