సారథి న్యూస్, రామగుండం: పట్టణాల పారిశుద్ధ్యమే ముఖ్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం ఆయన రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రధాన కాల్వల క్లీనింగ్‌ను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వాధ్యులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట రామగుండం కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, నారాయణదాసు, మారుతి, ఇరుగురాళ్ల శ్రావణ్, బూరుగు వంశీకృష్ణ, అబ్బాస్, శ్రీనివాస్, శ్రీకాంత్ ఉన్నారు.
- June 7, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- MLA KORUKANTI
- RAMAGUNDAM
- కార్పొరేషన్
- పట్టణ ప్రగతి
- మేయర్
- Comments Off on పట్టణాల పారిశుద్ధ్యమే ముఖ్యం