సారథి న్యూస్, రంగారెడ్డి: గ్రామాలతో పాటు పట్టణాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో కాలనీ వాసులు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్‌గుల్ 8వ వార్డులో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, అల్మాస్‌గూడ జయశంకర్ కాలనీలో రూ.47లక్షలతో డ్రైనేజీ పైపులైన్, నవయుగ కాలనీలో రూ.15 లక్షలతో డ్రైనేజీ, సాయినగర్ కాలనీలో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఆదివారం మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
- June 7, 2020
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- BADANGPET
- SABITHAINDRAREDDY
- పట్టణప్రగతి
- సీఎం కేసీఆర్
- Comments Off on పట్టణప్రగతిలో భాగస్వాములు కండి