Breaking News

పంచాయతీ సిబ్బందికి రూ.8500 వేతనం

షార్ట్ న్యూస్

గ్రామపంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి రూ.8500 వేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీతాన్ని ప్రతినెల 1వ తేదీనే చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆఫీసు తాజాగా ఆదేశించింది. పంచాయతీలకు ప్రతినెలా విడుదలవుతున్న రూ.336 కోట్ల నుంచి వీటిని చెల్లించువకోవచ్చని మార్గదర్శకాలు జారీచేసింది. ఈ నిబంధనలు పాటించని పంచాయతీలపై తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది.