Breaking News

నెటిజన్​పై గోవా బ్యూటీ ఫైర్​

సోషల్​మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కామెంట్లు పెట్టడం.. లైవ్​లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి వారిని ఇబ్బందులకు గురిచేయడమే కామనే. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితం గురించి ఇబ్బందికరంగా ప్రశ్నించిన ఓ నెటి​జన్​పై గోవా బ్యూటీ ఇలియానా ఫైర్​ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గురించిన అన్ని విషయాలనూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకునే ఇలియానా.. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని చెప్పింది. దీంతో పలువురు నెటిజన్లు ఆమెతో ఇంటరాక్ట్​ అయ్యారు. ఈ క్రమంలో ఓ నెటిజన్​ ‘మీరు ప్రస్తుతం సింగిల్​ గానే ఉన్నారా? అని ప్రశ్నించాడు. దీంతో ఇలియానా మండిపడింది. ఓ జంతువు ఫోటోను పోస్ట్ చేస్తూ అతడికి సమాధానం ఇచ్చింది. ‘ఇతరుల అఫైర్ల గురించి ఎందుకంత కూతూహలం’ అంటూ సీరియస్​ అయ్యింది. దీంతో ఇలియానా పోస్టుకు పలువురు నెటిజన్లు మద్దతు ఇస్తున్నారు. ఆమె సరిగ్గా స్పందించిందని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ఇలియానా కొంతకాలం డేటింగ్ చేసింది. తర్వాత అతడికి బ్రేకప్​ చెప్పిన విషయం తెలిసిందే.