Breaking News

‘నూడా’ కార్యకలాపాలు వేగవంతం

‘నూడా’ కార్యకలాపాలు వేగవంతం
  • చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి

సారథి న్యూస్​, నిజామాబాద్​: నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కార్యకలాపాలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగేందుకు నూడా పరిధిని నార్త్, సౌత్ జోన్ గా విభజించాలని నిర్ణయించినట్లు చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శనివారం నూడా ఆఫీసులో వైస్ చైర్మన్ జితేష్ వి.పాటిల్, సీపీవో జలంధర్ రెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ లేఅవుట్లను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.