- స్వతంత్ర కమిటీని నియమించిన పీసీబీ
కరాచీ: తనపై విధించిన మూడేళ్ల నిషేధంపై పాక్ బ్యాట్స్ మెన్ఉమర్ అక్మల్ అప్పీల్‌కు వెళ్లాడు. దీంతో ఈ కేసును విచారించేందుకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్వతంత్ర కమిటీని నియమించింది. విచారణ సందర్భంగా తన వాదనలను బలంగా వినిపించేందుకు బాబర్ అవాన్ కు చెందిన లా ఫర్మ్ ను అక్మల్ ఉపయోగించుకోనున్నాడు. అవాన్.. పాక్ ప్రధాని ఇమ్రాన్ కు పార్లమెంటరీ అఫైర్స్ సలహాదారుడిగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా కొందరు ఫిక్సర్లు ఉమర్‌ను కలవగా.. అతను ఆ విషయాన్ని దాచిపెట్టాడు. దీంతో పీసీబీ గతనెలలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మూడేళ్ల పాటు ఉమర్ ఏ ఫార్మాట్ క్రికెట్లోనూ ఆడకూడదని శిక్ష విధించింది.