Breaking News

నియంత్రిత సాగుతో లాభాలు


సారథి న్యూస్​, కొల్లాపూర్​: నియంత్రిత వ్యవసాయ సాగుతో రైతులకు లాభమేనని కొల్లాపూర్​ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి అన్నారు. బుధవారం పాన్​గల్​ తహసీల్దార్​ ఆఫీసు ఆవరణలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు భూసార పరీక్షలు చేయించాలని, అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని సూచించారు. అనంతరం 55 మంది దరఖాస్తుదారులకు రూ.55లక్షల కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఏవో సుధాకర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మీ, విండో వైస్ చైర్మన్ బాలయ్య పాల్గొన్నారు.