Breaking News

నా బయోపిక్‌లో నేనే నటిస్తా

  • అనుష్క కూడా ఉండాలి: కోహ్లీ

న్యూఢిల్లీ: క్రీడాకారుల బయోపిక్ చిత్రాలు తీయడం ఇటీవల సర్వసాధారణం అయిపోయింది. అందుకేనేమో.. కోహ్లీ కూడా తన బయోపిక్​ కు రెడీ అంటున్నాడు. తానే నటిస్తానని కూడా చెబుతున్నాడు. అయితే ఇందులో తన భార్య అనుష్కశర్మ కూడా నటించాలని షరతుపెట్టాడు. లేకపోతే బయోపిక్​ చేయనని స్పష్టం చేశాడు. ‘అనుష్కను కలవకముందు చాలా స్వార్థపూరితంగా ఉండేవాడిని. నా కంఫర్ట్‌ జోన్‌లో మాత్రమే బతికేవాడిని. మనం ప్రేమించే వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ల కోసం కూడా ఏదైనా చేయాలి. చాలా విషయాలను చర్చించుకోవాలి.

గతంలో మా మధ్య కూడా ఇలాంటి సంభాషణలు చాలా జరిగాయి. నిలకడగా ఇలాంటి చర్చలు జరిగినప్పుడు వ్యక్తిగతంగా కాకుండా సాహచర్యం గురించి ఆలోచిస్తాం. అనుష్క వచ్చాకా ఇవన్నీ ఆలోచించేలా చేసింది. ఆమె నా జీవితంలోకి వచ్చాక చాలా మారా. గతంలో ఇలా ఉండేవాడిని కాదు. ప్రతి వ్యక్తికి సొంత స్వభావం ఉంటుందని నా నమ్మకం. దీంతో పాటు ప్రతిఒక్కరి జీవితాల్లోనూ మార్పులు తెచ్చేవారు ఎవరో ఒకరు ఉంటారు. నా లైఫ్‌లోకి అనుష్క వచ్చాక ఆ మార్పు జరిగింది. మన జీవితంలో ఇతరులను కూడా చూసుకోవాలి. అలా జీవించడం వల్ల నువ్వెంటో ఏంటో తెలుస్తుంది. నా స్థాయి పెద్దదని, మరింత ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలని నాకు నేర్పింది. ఇప్పుడు వాస్తవ స్థితిలో జీవిస్తున్నా. సమస్యలను పరిష్కరించే స్థితిలో ఉంటే కచ్చితంగా చేస్తా’అని అని విరాట్‌ పేర్కొన్నాడు.