Breaking News

నల్లజాతీయుల ప్రాణాలూ ముఖ్యమే

న్యూఢిల్లీ: జాతి వివక్షపై క్రీడాకారుల గళం రోజురోజుకు పెరుగుతోంది. భిన్నత్వం లేకుంటే క్రికెట్ లేదంటూ ఐసీసీ చేసిన ట్వీట్​కు బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మద్దతిచ్చాడు. ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఆటకు ఉందని కితాబిచ్చాడు. అఫ్రో అమెరికన్ జార్జిఫ్లాయిడ్ మృతిపై చెలరేగుతున్న నిరసనలు, నల్లజాతీయుల ప్రాణాలు ముఖ్యమేనని కొనసాగుతున్న ఉద్యమానికి కూడా మాస్టర్ అండగా నిలిచాడు. ‘ఓసారి నెల్సన్ మండేలా.. ప్రపంచాన్ని మార్చే శక్తి ఆటకు ఉంది. మరెవరికీ సాధ్యంకాని రీతిలో అది ప్రపంచాన్ని ఏకీకృతం చేయగలదని చెప్పాడు’ అని సచిన్ ట్వీట్ చేశాడు.