సారథి న్యూస్, తలకొండపల్లి: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఏడీఏ రాజారత్నం హెచ్చరించారు. శుక్రవారం తలకొండపల్లి అగ్రికల్చర్ ఆఫీసులో విత్తనాలు, ఎరువుల డీలర్లకు సమావేశం నిర్వహించారు. గుర్తింపు పొందిన విత్తనాలనే రైతులకు విక్రయించాలని సూచించారు. కలుపు నివారణకు వాడే గ్లైకోసెల్ మందును అక్టోబర్ 30వ తేదీ వరకు అమ్మకూడదని సూచించారు. రైతన్నలు అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఈ సీజన్లో పత్తి, వరి పంటలు వేయాలన్నారు. సమావేశంలో స్థానిక ఎస్సై సురేష్ యాదవ్ పాల్గొన్నారు.
- June 5, 2020
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- ADA
- AGRICULTURE
- తలకొండపల్లి
- వ్యవసాయశాఖ
- Comments Off on నకిలీ విత్తనాలు అమ్మొద్దు