టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్. ధోనీ తన గురువు అని వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. యంగ్ ప్లేయర్లకు సాయం చేయడంలో మహీకి ప్రత్యేక పద్ధతి ఉందన్నాడు. సమస్య పరిష్కారానికి చాలా మార్గాలు సూచిస్తాడన్నాడు.
‘ధోనీ నా గురువు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఏ సందేహం వచ్చినా నేను ముందు మహీ బాయ్ కి ఫోన్ చేస్తా. అయితే నా సమస్యకు పూర్తి పరిష్కారం చూపకుండానే అనేక మార్గాలు సూచిస్తాడు. అలా చేయడం వల్ల నా సమస్యను నేను పరిష్కరించుకోగలుగుతా. నేను ఎవరిపై పూర్తిగా ఆధారపడకూడదనేది అతని ఉద్దేశం.
క్రీజ్ లో ధోనీ ఉంటే చాలా భరోసా ఉంటుంది. మనం చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేయగలుగుతాం. మనపై ఒత్తిడి లేకుండా చూస్తాడు. అందుకే అతనితో కలిసి ఆడటం చాలా ఇష్టం. కానీ మేమిద్దరం కలిసి బ్యాటింగ్ చేసే చాన్స్ చాలా తక్కువగా వస్తుంది’ అని పంత్ వెల్లడించాడు.