Breaking News

దుర్భర దారిద్ర్యంలోకి 4.7 కోట్ల మంది మహిళలు

దుర్భర దారిద్ర్యంలోకి 4.7 కోట్ల మంది మహిళలు


ఐరాస: కోవిడ్-19 కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కరువై పేదలు మరింత దారిద్ర్యం బారినపడుతున్నారు. కరోనా వల్ల 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.7 కోట్ల మంది మహిళలు అత్యంత పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. పేదరికాన్ని అంతమొందించేందుకు దశాబ్ద కాలంగా తాము చేస్తున్న కృషి వృథా అయిందని ఆందోళన వ్యక్తం చేసింది. 2019-2021 మధ్య కాలంలో మహిళల్లో పేదరికం 2.7 శాతం ఉంటుందని గతంలో అంచనా వేయగా, తాజాగా దాన్ని సవరిస్తూ 9.1 శాతానికి చేరుతుందని పేర్కొంది. వచ్చే ఏడాది నాటికి 9.6 కోట్ల మంది పేదలు మరింత దుర్భర స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని, వీరిలో 4.7 కోట్లమంది బాలికలు, మహిళలు ఉన్నారని యూఎన్డీపీ తాజా నివేదికలో పేర్కొంది. ఇక పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి 43.5 కోట్ల మంది మహిళలు తీవ్ర పేదరికంలోకి వెళ్లే ముప్పు పొంచి ఉందని నివేదికలో వెల్లడించింది.