సారథి న్యూస్, హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య, అధ్యక్షుడు గోరెంకల నర్సింహ్మ కోరారు. శనివారం ఎన్పీఆర్డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్ డౌన్ ముగిసే వరకు ప్రభుత్వం అంత్యోదయ కార్డుతో సంబంధం లేకుండా దివ్యాంగులకు 19 రకాల నిత్యావసర సరుకులు, 12 కిలోల బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కండాల క్షీణత వ్యాధి బాధితులందరికీ కుటుంబానికి 50 కిలోల బియ్యం, రూ.5వేలు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తిచేశారు.