తెలంగాణ జాగృతి, దివ్యాంగులు
సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ సమయంలో హయత్ నగర్, మన్సురాబాద్ డివిజన్ల పరిధిలో 60 మంది దివ్యాంగులకు తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి నల్లగొండ శ్రీనివాసులు, వనస్థలిపురం డివిజన్ జాగృతి అధ్యక్షులు చింతల రవి బియ్యం, నిత్యావసర సరుకులను శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు దివ్యాంగులకు సేవా కార్యక్రమలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అన్మగల్ హయత్ నగర్ డివిజన్ జాగృతి ఇన్ చార్జ్ మల్లికార్జున్ పాల్గొన్నారు.