లండన్: వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ అందుబాటులో ఉండడంపై సందిగ్దం నెలకొంది. జులై 8 నుంచి 12వ తేదీ వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో రూట్ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో డెలివరీ సమయంలో భార్య వద్ద ఉండాలనే అభిప్రాయంతో రూట్ ఉన్నాడు. దీనికోసం అతను సెలవు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇది పూర్తయిన తర్వాత రూట్ టీమ్‌తో చేరాలంటే క్వారంటైన్ నిబంధనలు అడ్డొస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అతను ఏడు రోజులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలి. దీంతో అతను తొలి టెస్ట్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇక ఈ సిరీస్‌కు ఆతిథ్యమిచ్చే వేదికల్లో బయోసెక్యూర్ వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సన్నాహకాలు మొదలుపెట్టనుంది.
- June 7, 2020
- క్రీడలు
- ENGLAND
- WESTINDIES
- ఈసీబీ
- జోరూట్
- హోమ్ ఐసోలేషన్
- Comments Off on తొలి టెస్టుకు రూట్ అనుమానమే