ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తన ప్రేయసి, కాబోయే భార్య నటాషా గర్భవతి అని ప్రకటించాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఎంగేజ్మెంట్ తంతును ముగించిన హార్దిక్ త్వరలోనే తాను తండ్రిని కాబోతున్నానని తెలిపాడు. గర్భంతో ఉన్న తన భార్యతో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
‘నేను, నటాషా కొత్త అంకంలోకి అడుగుపెడుతున్నా. సాఫీగా సాగుతున్న మా ప్రయాణం మరింత మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. మా జీవితాల్లోకి త్వరలోనే చిన్న ప్రాణం రాబోతుంది. ఆ చిన్న ప్రాణాన్ని స్వాగతించేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలో మొదలుకానున్న మరో నూతన అధ్యాయానికి మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని హార్దిక్ భావోద్వేగంతో రాసుకొచ్చాడు.