న్యూఢిల్లీ: పరిస్థితులు అనుకూలించి, గవర్నమెంట్ అనుమతిస్తే డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్ టోర్నీని నిర్వహించేందుకు తాము రెడీగా ఉన్నామని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) చెప్పింది.
ఈ మేరకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్)కు తెలియజేసింది. ఒలింపిక్స్ క్వాలిఫయర్ టోర్నీ అయిన ఇండియా ఓపెన్ షెడ్యూల్ ప్రకారం గత నెలలో జరగాలి. కానీ కరోనా దెబ్బకు వాయిదా పడింది. టోర్నీ రీ షెడ్యూల్ కు సంబంధించి బీడబ్ల్యూఎఫ్ వారం బాయ్ కు మెయిల్ పెట్టింది.
సెప్టెంబర్ లో టోర్నీ నిర్వహించగలరా? అని బీడబ్ల్యూఎఫ్ నుంచి మెయిల్ వచ్చిందని, అయితే తాము డిసెంబర్, జనవరిలో అయితే ఓకే అని రెండు ఆప్షన్స్ ఇచ్చామని బాయ్ జనరల్ సెక్రటరీ సింఘానియా తెలిపారు.
ఇక కాలిఫోర్నియా వేదికగా జూన్ 23–28 తేదీల్లో జరగాల్సిన యూఎస్ ఓపెన్ ను బీడబ్ల్యూఎఫ్ సస్పెండ్ చేసింది.