గౌహతి: క్వారంటైన్ సెంటర్లలో ఉన్న పేషంట్లు.. హెల్త్ వర్కర్లపై దాడి చేస్తే అటెంప్‌టివ్ మర్డర్ కింద నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామని అస్సాం హెల్త్ మినిస్టర్ హిమంత బిశ్వశర్మ అన్నారు. బొంగైగాన్, చిరాంగ్ జిల్లాల్లోని క్వారంటైన్ సెంటర్లలో ఫుడ్ సరిగా లేదని ఆరోపించిన పేషెంట్లు హెల్త్ వర్కర్లపై దాడిచేశారు. దీంతో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. మనం అందరం హెల్త్ వర్కర్లకు సపోర్ట్ చేయాలని, వాళ్లంతా మన కోసం వాళ్లంతా కష్టపడి.. ముందు ఉండి ఈ మహమ్మారి నుంచి కాపాడుతున్నారని ఆయన అన్నారు. అలాగే పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తనను సంప్రదించాలని, ప్రభుత్వం వారి ఇబ్బందులను తీరుస్తుందని చెప్పారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శర్మ చాలామంది అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇస్తూ ప్రజలకు చేరువలో ఉంటారు. అస్సాంలోని రెండు మూడు క్వారంటైన్ సెంటర్లలో ఉన్న పేషంట్లు హెల్త్ వర్కర్లపై దాడిచేశారు. అంతే కాకుండా గుట్కాలు నమిలి క్వారంటైన్ సెంటర్ల గోడలపై ఉమ్మారు. దీంతో వ్యాధి తొందరగా ప్రబలుతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు అస్సాం సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
- June 5, 2020
- జాతీయం
- ASSAM
- HEALTH WORKER
- అస్సాం
- హిమంత బిశ్వశర్మ
- Comments Off on డాక్టర్లపై దాడి చేస్తే నాన్‌బెయిలబుల్ కేసు