Breaking News

‘డర్టీ’ హరి

‘డర్టీ’ హరి

నిర్మాత ఎంఎస్ రాజు ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి సంగతి తెలిసిందే. ఎంతోమంది హీరోలు.. హీరోయిన్లు.. టెక్నీషియన్లను ఆయన తెలుగు తెరకు పరిచయం చేశారు. అయితే ఆయన దర్శకుడిగానూ మారి తాజాగా తెరకెక్కించిన యూత్ ఫుల్ మోడ్రన్ ఏజ్ సినిమా ‘డర్టీ హరి’. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు యూత్ లో క్రేజీని పెంచాయి. లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా కంటెంట్ ఉందని తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ట్రైలర్ మొదలైన దగ్గరినుంచి ఆద్యంతం వేడెక్కించే సన్నివేశాలకు కొదవేమీ లేదు. హరికి ఫ్రెండు ఐదు రూల్స్ చెబుతున్నాడు. ‘మొదటిది లైఫ్ ను నీట్ గా ప్లాన్ చేసుకోవాలి.. ఎప్పుడూ హైగా ఉండేలా చూసుకోవాలి.. రెండవది బాస్ కు కూతురు ఉంటే వెంటనే క్యాచ్ చేసి రీచ్ చేయాలి.. తనకు నచ్చినవన్నీ చేయాలి.. అయితే మూడో సలహా.. నీ బెస్ట్ ఫ్రెండ్ లవర్ కి మాత్రం అస్సలు సైట్ కొట్టకూడదు.. నాలుగో సలహా.. సైట్ కొడితే కొట్టావ్ కానీ కెలక్కే.. అంటుకుంటే పెంటైపోద్ది.. ఆ నాలుగూ వింటేగా ఐదవది చెప్పడానికి ఈ రూల్ నేను చెప్పను.. ! డర్టీ ఫెలో!!.. అంటూ డైలాగ్ లోనే థీమ్ ఏమిటో చెప్పేశారు. బ్యాక్ గ్రౌండ్ లో సునీల్ వాయిస్ ప్రధాన అస్సెట్ అనే చెప్పాలి.

‘డర్టీ హరి’ అన్న టైటిల్ కి న్యాయం చేసే సీన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. టైటిల్ కు తగ్గట్టే అన్నీ డర్టీ వేషాలు వేసే మోడ్రన్ యువకుడి కథాంశమిది. ఎంఎస్.రాజు ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంది. హీరో శ్రవణ్ రెడ్డి, స్మార్ట్ అప్పియరెన్స్ సిమ్రత్, రుహానీలు వేడెక్కించే స్టింట్ అస్సెట్స్.. మార్క్ కే రాబిన్ సంగీతం బాగుంది. ఈ చిత్రాన్ని ఎస్ పీజీ క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మించారు.

DIRTY HARI