Breaking News

ట్రైలర్ టాక్: ది వైట్ టైగర్

ట్రైలర్ టాక్: ది వైట్ టైగర్

ఒకప్పటి బాలీవుడ్ ఫేమస్ నటి ప్రియాంకాచోప్రా ఇప్పుడు హాలీవుడ్ నటీ అయ్యింది. నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైంది. ఇండియన్ బ్యాక్ డ్రాప్ లో ప్రియాంక నటిస్తున్న ‘ది వైట్ టైగర్’ ట్రైలర్ రిలీజైంది. అక్టోబర్ లో రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఆఫీషియల్ ట్రైలర్​ను రిలీజ్ చేసింది టీమ్. అమెరికన్ ఫిల్మ్ మేకర్ ర‌మిన్ బ‌హ్రాని దర్శకుడు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో సొసైటీలో ఒక వర్గం ఎలాంటి వివక్షకు గురవుతుందో స్పష్టంగా చూపించారు. ఫస్ట్ ట్రైలర్ లో లీడ్ రోల్ చేస్తున్న బలరామ్ (ఆదర్శ్) పాత్రను ఎక్కువగా రివీల్ చేశారు. ప్రియాంకా, రాజకుమారీ రావు రిచ్ వైఫ్ అండ్ హజ్బెండ్ రోల్స్, ఆదర్శ వాళ్ల డ్రైవర్ పాత్రలో కనిపించారు.
ఇదీ కథ
ఊరి నుంచి సిటీకి వచ్చిన బలరామ్ ఓ రిచ్ ఫ్యామిలీకి కారు డ్రైవర్ గా జాయిన్ అవుతాడు. అక్కడి వాళ్లతో చాలా ఇబ్బందులు పడతాడు. దానికి అతడు రివేంజ్ తీర్చుకుని వైట్ టైగర్ డ్రైవింగ్ ఇన్​స్టిట్యూట్​ ఎంటర్​ప్రెన్యూర్ అవుతాడు.. అన్నది రివీల్ చేస్తే.. సెకండ్ ట్రైలర్ లో ప్రియాంకా మామగారుగా మహేష్ మంజ్రేకర్ రోల్ చేశాడు. ఆదర్శ్ ను చీదరించుకుంటూ అవహేళనగా మాట్లాడుతాడు మహేష్ మంజ్రేకర్. చివరికి ప్రియాంకా, రాజకుమారీ రావు చేసిన ఒక యాక్సిడెంట్ ని ఆదర్శ్ మీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తారు. ప్రియాంకా వద్దని వారించినా భర్త, మామగారు వినరు. ఆదర్శ్ ఎలాగోలా ఆ కేసు నుంచి తప్పించుకుని బయటపడి.. వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. అయితే ఎలా తప్పించుకుంటాడు? ఎలా ఎంటర్​ప్రెన్యూర్ అయ్యాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. చివరగా ‘నేను నిద్రలోంచి లేచాను.. మీరే మేల్కొనాలి..’ అన్న ఆదర్శ్ డైలాగ్ ఇంటరెస్టింగ్ గా ఉంది. ఎలా చూసినా ఆదర్శ్ గౌరవ్ పోషించిన బ‌ల‌రామ్ అనే డ్రైవర్ జీవితమే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ప్రియాంక మామగారు పాల్ కెవిన్ జోనాస్ కి ఈ ట్రైలర్ ఎంతగానో నచ్చిందట. నా కోడలిను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది, ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నాను అంటూ ప్రశంసలు కురిపించాడు. ప్రియాంక ఇందులో నటించడమే కాదు ఈ మూవీకి కోప్రొడ్యూసర్ కూడా. జనవరి 22న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది.